ప్రథమంగా భారతదేశంలో లూథరన్ మిషన్‌ను స్థాపించడానికి అమెరికా లూథరన్ సోసైటీ 1841 సంవత్సరంలో ఫాదర్ జాన్ ఫెడరిక్ హైయర్ గారిని పంపింది. ఫాదర్ హైయర్ గారు 1842 జూలై 31న గంటూరు ద్వారా ఆంధ్ర ఈవాంజెలికల్ లూథరన్ సంఘాన్ని స్థాపించారు.
తర్వాత A.E.L.C సంఘము దేవుని దయ వల్ల బహుముగా అభివృద్ధి చెందింది. అందులో భాగంగా 1964 సంవత్సరంలో హైదరాబాద్‌లోని లక్ష్మీకాంతపుర్‌లో లూథరన్ సంఘము స్థాపించబడింది. ఆ సంఘం దేవుని కృప వల్ల A-Class Parish స్థాయికి ఎదిగింది.
అప్పట్లో ఆ చర్చి కమిటీ ఆధ్వర్యంలో చర్చి ప్లాంటేషన్ చేయాలని నిర్ణయించబడింది. ఆ రోజుల్లో బౌరంపేట్, సూరారం, జీడిమెట్లా, చంతల్, బాలనగర్ పరిసరాల్లో నివసిస్తున్న అనేక లూథరన్ కుటుంబాలు లక్ష్మీకాంతపుర్ సంఘానికి వచ్చేవారు.
ఈ క్రమంలో కొంతమంది పెద్దలు, సంఘస్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించి, లక్ష్మీకాంతపుర్ సంఘం కాపరియైన కీ.శే. రేవ. జి. విజయాకర్ గారు, సంఘ చైర్మన్ శ్రీ రాజేంద్రప్రసాద్ గారు మరియు సంఘ ట్రెజరర్ కె.ఎల్. శిరీష్ బాబు గారు చర్చి స్థాపనకి సహాయం చేయమని కోరారు. అప్పటి మన పెద్దలైన యస్. జాన్ స్ధు గారు, వి. వెంకటరతనుంగారు మరియు ప్రభుదాస్ గారు అభ్యర్థించారు.
కాబట్టి వారి అభ్యర్థనను స్వీకరించి, చంతల్ పరిసరాల్లో అంబంధ సంఘాన్ని స్థాపించేందుకు ఒప్పుకున్నారు. ఈ క్రమంలో యస్. జాన్ స్ధు గారి గృహమునందు 1998 ఆగస్టు 15న, రేవ. విజయాకర్ గారు మొదటి ఆరాధన నిర్వహించారు. ఆ ప్రారంభంలో వి. వెంకటరతనుంగారు, యస్. స్ధీర్ గారు, కె. ప్రసాద్ బాబు గారు మరియు మరికొందరు కుటుంబాలు ఆరాధనలో పాల్గొన్నారు.
ఆ తరువత చంతల్ గణేష్ నగర్ లోని కీ॥శే॥ మణిగారి బిల్డంగ్ నందు రెండవ అంతస్థా అద్ది తీస్కని ఆరాధనన్ జరిగంచారు. తరువత A.E.L.C రిటైర్డ్ సంఘకాపరియైన కీ.శే. రేవ. బోరుగడ్డ సుందర రావు గారు మన సంఘానికి మొదటి సంఘ కాపరిగానే నియమింపబడ్డారు.
1998 అక్టోబర్ 31వ తేదీన సంఘ కాపరియైన బోరుగడ్డ సుందర రావు గారు వారిని సంఘ పెద్దలుగా అభిషేకించారు. వారిలో 1) శ్రీ కె. జాన్ (ట్రెజరర్), 2) శ్రీ యస్. జాన్ స్ధు, 3) శ్రీ వి. వెంకట రతనుంగారు, 4) శ్రీ జి. ప్రభుదాస్, 5) శ్రీ జంగం అనీల్ స్టీవెన్ సన్, 6) శ్రీ కె. ప్రసాద్ బాబు, 7) శ్రీ కె. సంజీవ రావు, 8) శ్రీ ఎన్. పృద్వరాజ్, 9) శ్రీ జోసెఫ్, 10) శ్రీ వి.వి. రత్నకర్, 11) శ్రీ పుష్యోత్తము మరియు 12) శ్రీ యస్. స్ధీర్. తరువాత శ్రీ కె. వెంకటేశ్వరులో, శ్రీయం.యం. దత్తు, శ్రీ వై. ప్రసన్న కుమార్, శ్రీ సి.హెచ్. మణి కుమార్, శ్రీ జి. డేవిడ్ రాజు, శ్రీ బి. రమేష్ మరియు శ్రీ కె. నరేంద్రబాబు గారు సహ పెద్దలుగా అభిషేకించబడ్డారు.
ఈ విధంగా ఆరాధనలు జరుగుతున్న క్రమంలో సంఘాన్ని నడిపించడంతో రెండు, మూడు స్థలాలకు మారడం జరిగింది. ఆ స్థలంలో వచ్చిన ఇబ్బందులను గమనించి యస్. జాన్ స్ధు గారు, వి. వెంకట రతనుంగారు మరియు జి. ప్రభుదాస్ గారు సంఘానికి స్థలాన్ని కనుగొనాలని నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలో సంఘ పెద్దలు మరియు సంఘస్థులు కలిసి శ్రీ జంగం అనీల్ స్టీవెన్ సన్ గారిని సంఘంలోని Construction Committee Chairmanగా నియమించారు. అప్పటి నుండి ఆయన ఆధ్వర్యంలో సంఘ స్థలం కోసం ఎన్నో ప్రయత్నాలు జరిగాయి.
జంగం అనీల్ స్టీవెన్ సన్ గారి తండ్రి శ్రీ జంగం పరిశుద్ధి రావు గారు, అప్పటి లక్ష్మీకాంతపుర్ చర్చ్ ట్రెజరర్ శ్రీ కె. శిరీష్ బాబు గారు మంచి మిత్రులై సంఘానికి ఆర్థిక సహాయం అందించారు.
ఆ ప్రయత్న ఫలితంగా యస్. జాన్ స్ధు గారు మరియు జంగం అనీల్ స్టేవెన్ సన్ గారు కలిసి ప్రస్తుతం మన సంఘ ఆరాధన జరుగుతున్న స్థలాన్ని 350 గజాల స్థలంగా కొనుగోలు చేశారు. అలాగే మరో 350 గజాల స్థలాన్ని ఒక పెద్దాకి కొనుగోలు చేసారు.
చర్చీ స్థలం కొనుగోలు ఒప్పందం 6 నెలల తర్వాత సంఘ నిధులు సమకూర్చలేకపోయింది కాబట్టి ఆ స్థల యజమాని మనకు ఆ స్థలాన్ని ఇవ్వాలని నిరాకరించాడు. బదులుగా మరొక స్థలాన్ని (ప్రస్తుతం శ్రీ డేవిడ్ రాజ్ గారు నివసిస్తున్న) సూచించాడు.
శ్రీ జంగం అనీల్ స్టేవెన్ సన్ గారు లేని సమయంలో, అప్పటి సంఘ కాపరియైన రేవ. కె. సమర్పణ కుమార్ గారు, సంఘ పెద్దలు మరియు సభులు మరో స్థలాన్ని తీసుకోవడానికి అంగీకరించారు. ఒక ఆదివారం వారు మన ప్రస్తుత చర్చీ స్థలం దగ్గర నిలబడి ఉండగా జంగం అనీల్ స్టేవెన్ సన్ గారు అక్కడికి వచ్చి పరిస్థితి గురించి తెలుసుకొని ఆ పాత స్థలాన్ని తిరిగి చూడటానికి వెళ్ళారు.
ఆ స్థలం చరువు లాగా కనిపించడంతో జంగం అనీల్ స్టেভెన్ సన్ గారు ఒప్పుకోలేదు. తిరిగి మన ప్రస్తుత చర్చీ స్థలం దగ్గరికి వచ్చి ఆ స్థల యజమాని మరియు మరికొందరు సభ్యులతో గొడవపడ్డారు. వారంతా వేరే స్థలం తీసుకోవడానికి ఒప్పుకోలేదు. తదుపరి రోజు ఆ స్థల యజమాని ఒక టీజీ కంపెనీ ఉద్యోగి కావడంతో 20 మందిని కలిసి జంగం అనీల్ స్టేవెన్ సన్ గారి ఇంటి వద్దకు వచ్చి బహిరంగంగా గొడవపడ్డారు.
ఆ తరువాత రాజీ మారేటప్పుడు జంగం అనీల్ స్టేవెన్ సన్ గారు మరియు జాన్ స్ధు గారు కలిసి ప్రస్తుత చర్చీ స్థలానికి సమీపంలో ఉన్న మరో స్థలాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించారు.
2006 డిసెంబర్ 3వ తేదీ న మన సెంట్రల్ గంటూరు సిన్డు ప్రెసిడెంట్ గారైన రైట్ రేవ. సి. హెచ్. ఏలీయ గారి ఆధ్వర్యంలో రేవ. జి. విజయాకర్ గారు, రేవ. కె. సమర్పణ కుమార్ గారు, కె. ఎల్. శిరీష్ బాబు గారు, జయకర్ గారు, జంగం అనీల్ స్టేవెన్ సన్ గారు, కె. ప్రస్ద్ బాబు గారు, కె. జాన్ గారు, జి. గంగయ్ గారు తదితరుల ఆధ్వర్యంలో పన్నిరాయలు వేశారు.
2009 సం॥లో రేవ. జి. జోసఫ్ రాజు గారి ఆధ్వర్యంలో రేవ. బి. స్‌ందర రావు గారిని ఆహ్వానించి 2009 డిసెంబర్ 22 తేదీన మన ఆలయ ప్రతిష్టా జరుపుకున్నాము.
మందిర నిర్మాణ పనుల్లో సీలాపూర్ నుంచి చర్చ్ టవర్ వరకు మందిరం యొక్క ఫౌండేషన్ నిర్మాణంలో శ్రీ కె. ప్రస్ద్ బాబు (ఇంజనీర్) గారు ఎంతో శ్రమపడి పాల్గొన్నారు. చర్చి సీలాపూర్ నిర్మాణ సమయంలో బేస్‌మెంట్ వరకు రసాయన నీరు రావడంతో వాటిని సరిపోయేలా చేయడానికి జి. గంగయ్ గారు, కె. ప్రస్ద్ బాబు గారు, యం.యం. దత్తు గారు, వి.వి. రత్నుకర్ గారు, వై. ప్రసనను కుమార్ గారు ఎంతో కష్టపడి బేస్‌మెంట్ వేసి గోడలు నిర్మించారు.
మন্দిర నిర్మాణ సమయంలో ధనం చెలామణిలో లేనందున యస్. జాన్ స్ధు గారు, జంగం అనీల్ స్టేవెన్ సన్ గారు, వి. వేంకట రతనుంగారు మరియు సంఘ సభు పెద్దల సహకారంతో సంఘ నిర్మాణం జరిగింది.
సంఘ ఆరాధనలు జరుగుతున్న సమయంలో సంఘానికి రావడానికి ప్రయాణ సదుపాయాలు లేనందున, జంగం అనీల్ స్టేవెన్ సన్ గారు బస్సులు ఏర్పాటు చేసి వారిని ప్రతి ఆదివారం చర్చ్‌కు తీసుకుని వెళ్ళీ తిరిగి తీసుకువెళ్లడం ద్వారా సహకరించారు. అలాగే క్రిస్మస్ కార్యక్రమాలకు బస్సులు మరియు స్మాల్గన్ ఏర్పాటు చేశారు.
సంఘ నిర్మాణ సమయంలో అప్పటి సంఘ కాపరియైన రేవ. జి. జోసఫ్ రాజు గారు ఎంతో శ్రమించారు. ఈ మందిర నిర్మాణానికి చాలా దాతలు ధన రూపంలో, వస్తు రూపంలో, శ్రమ రూపంలో సహాయ సహకారం అందించారు.
అప్పటి నుండి సంఘంలో ఆరాధనలు, స్త్రీల సమాజం, యూత్ ఫెలోషిప్ మరియు సండే స్కూల్ కార్యక్రమాలు దేవునికి మహిమగా జరిగాయి. 2019 సంవత్సరంలో చర్చ్ బెల్‌ను ఏర్చారు. మన మందిరంలో దేవునికి మహిమగా అనేక కార్యక్రమాలు జరిగుతూనే, సంఘం దినదినం ఆధ్యాత్మిక సంబంధమైన ఆలోచనలతో విస్తరించింది.
ఈ 25 వసంతాలుగా పది మంది సేవకులు తమ సేవలతో సంఘానికి ఎంతోగానే కృషి చేశారు. అందులో ముఖ్యంగా రేవ. సమర్పణ కుమార్ గారు స్థలం సేకరణలో మరియు రేవ. జోసఫ్ రాజు గారు మందిర నిర్మాణంలో విరివిగా సేవలందించారు.
బౌరంపేట నుంచి మన సంఘ సభ్యులైన శ్రీ తోట వెంకట రావు గారు, శామ్ గారు, స్టేలిన్ గారు తదితరులు మా ప్రాంగణంలో లూథరన్ సంఘాన్ని ఏర్పాటు చేయాలని మన సంఘ పెద్దలను అభ్యర్థించారు. బౌరంపేటలోని ఇంద్రమ్మ కాలనీలో సంఘం ఏర్పాటు చేయడానికి రేవ. కె. జీవన్ స్మూల్ గారు, యస్. స్ధీర్ గారు, కె. జాన్ గారు మరియు పోతుల జోసెఫ్ రాజు గారు వెళ్లి 2022 జనవరి 2వ తేదీన సంబంధ సంఘాన్ని ప్రారంభించారు.
2022 జనవరి 9వ తేదీన, తోట వెంకట రావు గారి గృహంలో క్రైస్తవ లూథరన్ సంఘం మొదటి ఆరాధన జరిగింది. జోసెఫ్ రాజు గారు తన కారులో దాదాపు రెండు నెలల వరకు పాస్టర్‌గా మరియు సంఘ పెద్దల సహకారంతో ఆరాధనలకు తీసుకువెళ్లడం ద్వారా చాలా సహాయం చేసారు.
తరువాత మన సంఘ సభ్యులైన వాణి ప్రసద్ గారు, కె.డి.వి. ప్ల్ గారు, శ్రీమతి వాణి గారు, శ్రీ జె. వెంకటరావు గారు, యన్. పృధీ్వరాజ్ గారు, వై. ప్రసనను కుమార్ గారు, వై. ప్రవీణ్ కుమార్ గారు మరియు యం. రాజేష్ గారు తదితరులు అక్కడ ఆరాధనలకు వెళ్ళి సంఘ కార్యక్రమాల్లో సహకరించారు.
ఇందునాటి తరువాత ఆ సంఘం కూడా ఎంతో ఆత్మీయంగా బలపడుతూ, దినముందు అభివృద్ధి చెందింది.